పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు మండలంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.