అమరుల త్యాగాలను మరువలేము: ఎస్పీ
NGKL: అమరుల త్యాగాలను మరువలేమని జిల్లా ఎస్పీ రఘునాథ్ అన్నారు. కొల్లాపూర్‌లో సోమశిల వద్ద నక్సల్స్ పెట్టిన మందు పాత్ర పేలి MBNR జిల్లా ఎస్పీ పరదేశి నాయుడుతో సహా 8 మంది మృతి చెందారు. ఈ సందర్భంగా నిన్న ఎస్పీ మాట్లాడుతూ.. అమర పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సోమశిలలోని ఫారెస్ట్ అతిథి గృహాన్ని మావోయిస్టులు పేల్చి వేశారని తెలిపారు.