VIDEO: స్విమ్మింగ్ పూల్ ఘటన.. సీసీ కెమెరాలు ఆఫ్
HNK: ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో ఫర్హత్ ఆమె ఇద్దరు కుమార్తెలు మృతి ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం స్విమ్మింగ్ పూల్ వద్ద సీసీ కెమెరాలు ఘటన సమయంలో ఆఫ్‌లో ఉండటం అనుమానాలకు దారితీసింది. మహ్మద్ అజారుద్దీన్ కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత కెమెరాలు, లైట్లు ఆఫ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.