రూ. 70 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ

JGL: పట్టణంలో దాదాపు రూ.70లక్షలతో పలు అభివృద్ధి పనులకు జగిత్యాల MLA డాక్టర్ సంజయ్ కుమార్ ఇవాళ శంఖుస్ధాపన చేశారు. పట్టణంలోని 10 వ వార్డు (లింగంపేట)లో రూ.25 లక్షల నిధులతో,12 వవార్డు (ఉప్పరిపేట)లో రూ.25 లక్షల నిధులతో,13 వ వార్డులో 20 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.