గజ్వేల్‌ బంద్.. బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

గజ్వేల్‌ బంద్.. బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

SDPT: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ బంద్ చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీగా తిరిగి వ్యాపార సంస్థలను మూసివేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీలు తమ కార్యాలయాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టుకుంటారా అని ప్రశ్నిస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు.