మత్తు పదార్థాలు వద్దు.. అంబలి ముద్దు
KMR: నిజాంసాగర్ రోడ్డులో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని నేడు ఎక్సైజ్ శాఖ సందర్శించింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ CI సంపత్ మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా యువత మత్తు పదార్థాలు సేవించకుండా దూరంగా ఉంటూ అంబలిని సేవించాలని హితవు పలికారు. ప్రజల దప్పిక తీర్చే అంబలి కేంద్రాల, చలివేంద్రాల నిర్వహకులను ఆయన ప్రశంసించారు.