వేపాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

వేపాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ప్రజలకు పారదర్శకతతో కూడిన వేగవంతమైన సేవలు అందించడమే "ప్రజా దర్బార్" ప్రధాన ఉద్దేశ్యం అని ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. వేపాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పిర్యాధులను స్వీకరిస్తూ.. తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.