V IDEO: ఆదివాసీ గ్రామాల్లో ఫ్లోరైడ్ నీరే దిక్కు
ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో మంచి నీటి సదుపాయం కరువైంది. దీంతో వారికి ఫ్లోరైడ్ నీళ్లే దిక్కయ్యాయి. వెంకటాపూర్‌లో బోరింగ్ నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందని, ఈ నీరు తాగడానికి పనికిరాదని అధికారులు బోరింగ్‌పై రాశారు. అయినా వారికి అవగాహన లేక, వేరే దారిలేక ఆ నీటినే తాగాల్సి వస్తోంది. ఫ్లోరైడ్ వల్ల చిన్నారుల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.