నూతన బార్ పాలసీపై అవగాహన కార్యక్రమం

ATP: గుత్తి ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం నూతన బార్ పాలసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య పాల్గొన్నారు. లైసెన్స్ దారులు, ఔత్సాహికులకు నూతన బార్ పాలసీపై అవగాహన కల్పించారు. మున్సిపాలిటీకి ఒక నూతన బార్ ఏర్పాటు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.