డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు
సత్యసాయి: సోమందేపల్లిలోని శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానంలో డైనింగ్ హాల్ నిర్మాణానికి హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి రూ.15 లక్షలు మంజూరు చేశారు. శుక్రవారం సోమందేపల్లిలో దేవస్థానాన్ని ఎంపీ సందర్శించారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ఎంపీ ఓడీఈకు ఫోన్ చేసి ఆదేశించారు. అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీకి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.