అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య పూరిత ఆరోపణలు

PDPL: రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసత్య పూరిత ఆరోపణలు చేస్తున్నారని, యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం 8వ కాలనీ ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్‌లో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అవగాహన రాహిత్యంతో మాట్లాడటం మానాలన్నారు.