రెవెన్యూ గ్రామసభ నిర్వహించిన మార్కాపురం MRO
ప్రకాశం: మార్కాపురం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వెబ్ ల్యాండ్ అడంగల్లో ఇతరులు' అని నమోదైన భూములను పరిశీలించి వాస్తవ పట్టాదారుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైందని MRO చిరంజీవి తెలిపారు .మార్కాపురం మండలం ఈడుపూరు రెవెన్యూ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో 32 మంది రైతులు తమ భూములకు సంబంధించిన దస్తావేజాలతో పేరు మార్పిడి కోసం అర్జీ సమర్పించారు.