VIDEO: శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
RR: రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లి సర్వారెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.