సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలోని హేమనగర్‌లో లక్ష్మీ గణపతి కాలనీ స్వాగత ద్వారం, 72 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రారంభించారు. సీసీ కెమెరాల వల్ల నేరాలు అదుపు చెయ్యవచ్చని, ఎలాంటి వారినైనా ఈ సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని మల్లారెడ్డి తెలిపారు.