మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఫైర్
W.G: మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం సాయంత్రం ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హెలికాప్టర్లు, విమానాలు కూలిపోతే బాగుండు అనే విధంగా పేర్ని నాని వ్యాఖ్యానించడం వారి కుట్రకు నిదర్శనమన్నారు. వైఎస్ హెలికాప్టర్ కూలిన నాటి నుంచి వారికి సైకో మనస్తత్వం అలవడిందని ఆయన విమర్శించారు.