మడకశిర క్రికెట్ స్టార్ దీపికకు నేడు ఘన సన్మానం
సత్యసాయి: మడకశిరకు గర్వకారణమైన క్రికెటర్ కుమారి దీపిక మహిళల T–20 వరల్డ్‌కప్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో, ఆమెకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘన సన్మానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, సినీ నటుడు సాయి కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.