పీజీఆర్ఎస్‌కి విశేష స్పందన
VZM: కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక', 'రెవెన్యూ క్లినిక్' కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. సోమవారం ప్రజల నుంచి మొత్తం 228 వినతులు అందగా, అందులో అత్యధికంగా 89 రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి స్వయంగా వినతులను స్వీకరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.