ఇస్ఫహాన్‌పై ఇజ్రాయెల్, యూఎస్ భారీ దాడులు

ఇస్ఫహాన్‌పై ఇజ్రాయెల్, యూఎస్ భారీ దాడులు

ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన అణు కేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఉదయం నుంచి నగరంలోని వివిధ ప్రదేశాల్లో భారీ పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు. నగరంలో చాలా చోట్ల భారీ ఎత్తున నల్లని పొగ ఆకాశాన్ని కమ్మేసింది.