నాగ్ కింగ్స్‌పై మహేష్ బాబు గ్లోబ్ ట్రొట్టర్స్ గెలుపు

టాలీవుడ్ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్‌లో మంగళవారం నాగ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహేష్‌బాబు గ్లోబ్ ట్రొట్టర్స్ 232 పరుగులు చేసింది. 233 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన నాగ్ కింగ్స్ 192 పరుగులే చేసింది. దీంతో 40 పరుగుల తేడాతో గ్లోబ్ ట్రొట్టర్స్ గెలిచింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైనా రెండవ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించిన గ్లోబ్ ట్రొట్టర్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.