VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న మిడత వాగు
NLR: కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం సమీపాన ఉన్న మిడత వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో గత రాత్రి నుంచి భారీ వర్షం వల్ల ఎగువ నుంచి వరద ఉదృతంగా రావడంతో మిడత వాగు తీవ్ర రూపం దాల్చింది. దీంతో కావలి నుంచి కొండాపురం రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు పోలీస్ శాఖ ప్రజలకు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు.