ముగిసిన అయోధ్య రామమందిర దర్శనం
సత్యసాయి: తనకల్లు మండలంలోని పెద్దపల్లి వద్ద ముక్తియార్ బాషా ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిరం దర్శనం శుక్రవారంతో ముగిసింది. శ్రీరామ నవమి రోజున రామమందిరం దర్శనం ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మందిరాన్ని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.