అక్రమంగా మట్టి తరలింపు.. ట్రాక్టర్ సీజ్

అక్రమంగా మట్టి తరలింపు.. ట్రాక్టర్ సీజ్

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని కారంపల్లి పంచాయతీ పరిధిలోని కృష్ణమ్మ చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దాడి చేయగా, 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీ తప్పించుకున్నాయని తెలిపారు. వారు మాట్లాడుతూ.. అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.