NDRF సిబ్బందిచే విద్యార్థులకు అవగాహన
KKD: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఏ విధంగా రక్షించాలి అనే విషయాలపై NDRF సిబ్బంది విద్యార్థులకు అవగాహన కలిగించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సోమవారం జగ్గంపేట మండలం రాజపూడి, మల్లిశాల, రామవరం గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.