VIDEO: నకిలీ నోటు కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాలలో నకిలీ రూ.500 నోటు కలకలం సృష్టించింది. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే క్రమంలో.. ఒక మహిళా సభ్యురాలు డబ్బు జమ చేయడానికి వెళ్లగా.. నకిలీ నోటు వెలుగు చూసింది. గతంలోనూ రెండుసార్లు నకిలీ నోట్లు వచ్చాయని ఆ సభ్యురాలు ఆందోళన వ్యక్తం చేశారు.