రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని జె.సీ అగ్రహారం, మల్లాపురం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ మాట్లాడుతూ.. మొక్కజొన్న పైరును విత్తన ఉత్పత్తి కొరకు సాగుచేసే రైతులు విత్తనోత్పత్తి కంపెనీ ప్రతినిధుల నుంచి అగ్రిమెంట్ తీసుకున్న తర్వాతే సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక రైతులు పాల్గొన్నారు.