'నీటి భద్రతతోనే జల మట్టం పెంపు'
ASR: పాడేరులో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' 100 రోజుల కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ నిశాంతితో కలిసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు జలమట్టాన్ని 1.5 మీటర్లు పెంచాలని ఆమె అధికారులకి సూచించారు. పంచసూత్రాలు అమలుచేస్తూ ప్రతి నీటిబొట్టును కాపాడుకోవాలని, ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.