శరవేగంగా హైవే పనులు
KMR: బాన్సువాడ నియోజకవర్గంలో గతేడాది నుంచి కొనసాగుతున్న 765 డీ హైవే పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. బాన్సువాడ నుంచి నస్రుల్లాబాద్, వర్ని, రూద్రూర్ మండలాల మీదుగా బాసర వరకు రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో బాన్సువాడ-బోధన్ వెళ్లే రహదారిపై నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది.