ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

KMM: కూసుమంచి మండలంలో ఐదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో, వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.