అపస్మారక స్థితిలో బాలిక.. బంధువుల ఆందోళన

అపస్మారక స్థితిలో బాలిక.. బంధువుల ఆందోళన

RR: పోచంపల్లి మండలం భీమనపెళ్లికి చెందిన నిహారిక(11) రూ.10 నాణెం మింగింది. దీంతో కుటుంబీకులు వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శుక్రవారం ఆపరేషన్ చేసి నాణెం తీశారని, ఇవాళ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిందని బంధువులు ఆరోపించారు. పాపకు ఇక్కడ చికిత్స చేయలేమని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.