యూరియా కోసం రైతుల ఇబ్బంది..

యూరియా కోసం రైతుల ఇబ్బంది..

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు శనివారం ఉదయం నుంచే ఎండలో వేచి చూశారు. మధ్యాహ్నం దాటినా అగ్రోస్ సేవా కేంద్రం తలుపులు తెరవకపోవడంతో వృద్ధులు, మహిళలు చెప్పులు లైన్‌లో పెట్టి పక్కన కూర్చుని వేచిచూశారు. వ్యవసాయ అధికారులు అందుబాటులో లేక రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.