సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
SKLM: అరసవిల్లి ప్రాంతంలో సీసీ రోడ్ల మరమ్మతు పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ హాజరై, శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పాండ్రంకి శంకర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన విజయ్ ఉన్నారు.