'PHCలో శాశ్వత వైద్యులను నియమించాలి'

'PHCలో శాశ్వత వైద్యులను నియమించాలి'

GNTR: మంగళగిరి పరిధిలోని యర్రబాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాశ్వత వైద్యులను నియమించాలని సీఐటీయూ రాజధాని డివిజన్ అధ్యక్షుడు ఎం.రవి డిమాండ్ చేశారు. పీహెచ్‌సీలో మంగళవారం జరిగిన ఆశా డే సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని కోరారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.