సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన
కామారెడ్డి ప్రీమియర్ లీగ్ క్రికెట్ వేదికగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ విభాగం ఎస్సై నరేష్ క్రీడాకారులకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, డిజిటల్ అరెస్ట్, పార్ట్‌టైమ్ జాబ్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దని, మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.