VIDEO: సీతానగరం మండలంలో సీసీ కెమెరాలేవి?
E.G: సీతానగరం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో నిఘా నేత్రాలు లేక చోరీలు, ప్రమాదాల దర్యాప్తులో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకముందే అధికారులు స్పందించి, మండల కేంద్రంతో పాటు కీలక ప్రాంతాల్లో నిఘా కెమెరాలు అమర్చాలని స్థానికులు కోరుతున్నారు.