అధికారుల నిర్లక్ష్యంపై బాధితుడి వేదన

అధికారుల నిర్లక్ష్యంపై బాధితుడి వేదన

SKLM: పొందూరులోని బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తికి దివ్యాంగుల పింఛను కింద నెలకు రూ.6 వేలు వచ్చేది. వైకాపా అధికారంలోకి వచ్చాక సాంకేతిక సమస్యల సాకు చూపి ఆసరాను దూరం చేశారు. నాటి నుంచి నేటి వరకు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ కరుణించడం లేదు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.