'చెత్తా చెదారంతో ఇబ్బంది పడుతున్న స్థానికులు'

WGL: నర్సంపేట పట్టణంలో పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో డ్రైనేజీలలో మురుగునీరు, చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు పెరిగి మలేరియా, డెంగీ వ్యాధులు వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు ఆదివారం డిమాండ్ చేశారు.