నూతన భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం

నూతన భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం

RR: హయత్ నగర్ డివిజన్ రాక్ టౌన్ కాలనీలో నూతన భూగర్భ డ్రైనేజీ పైపులైన్ పనులను కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం అందించేలా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తయితే మురుగునీటి సమస్య పూర్తిగా తొలగి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.