గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి

AKP: గొలుగొండ మండలం పుత్తడి గైరంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.శ్రీను అనే 27 ఏళ్ల యువకుడు గుండెపోటుతో కన్నుమూశాడు. ఇవాళ తెల్లవారుజామున 5:00 సమయంలో గుండెపోటు రాగా, ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మృతితో గామంలో విషాద చాయలు కమ్ముకున్నాయి.