రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

PDPL:  రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మంథని అదనపు సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. మంథని సామాజిక వైద్యశాలను అదనపు సివిల్ జడ్జ్ సుధారాణి మంగళవారం సందర్శించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వార్డులన్నీ పరిశీలించి ఆసుపత్రి వాతావరణం బాగుందని మెచ్చుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.