'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వం లక్ష్యం'
నంద్యాలలోని TDP కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ.ఫరూక్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వయంగా స్వీకరించి, సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడని సూచించారు.