ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌గా శ్రీనివాస్
KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్ ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి ప్రకటించారు. ఈ నియామకం తక్షణ ప్రభావంతో అమల్లోకి వచ్చిందని, పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల, పట్టణ, గ్రామ స్థాయి కమిటీలను సమన్వయం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు.