'క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే'

'క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే'

SKLM: పొందూరు మండల పరిధిలో ఉన్న క్వారీ యజమానులతో డీఎస్పీ వివేకానంద మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాస్టింగ్ సమయంలో కార్మికులు, స్థానిక ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మందుగుండు నిల్వ, రవాణా, వినియోగంలో నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.