వినాయక చవితి నిర్వాహకులకు ఎస్సై సూచనలు

TPT: నాగలాపురం మండలంలో వినాయక చవితి నిర్వాహకులకు ఎస్సై మల్లికార్జున్ సూచనలు చేశారు. మండపాలు ఏర్పాటు చేసుకునే ఏడు రోజుల ముందు అనుమతులు తప్పనిసరిగా అవసరమన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఏర్పాట్లు చేసుకోవద్దని చెప్పారు. మైకులు, మ్యూజిక్ సిస్టం నిర్ణీత సౌండ్స్‌లోనే ఉపయోగించుకువాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని వెల్లడించారు.