సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా జాతీయరహదారుల పైకి పశువులు వస్తుండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. జాతీయ రహదారులపై పశువులు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాల్లో వాహనదారులతో పాటు మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని తెలిపింది. ఈ మేరకు రహదారులపై వీధి పశువుల చొరబాటుపై నాలుగు వారాల్లోగా ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రం, రాష్ట్రాలను కోరింది.