వెలిచాల గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం
VKB: వెలిచాల గ్రామంలో నూతన సర్పంచ్‌గా ఎన్నికైన కావలి శ్రీనివాస్ మొట్టమొదటిసారి సంపూర్ణ మధ్య నిషేధం కోసం శ్రీకారం చుట్టి, గ్రామస్తులందరి చేత సామూహిక ప్రతిజ్ఞ చేయించి తీర్మానం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కావలిశ్రీనివాస్ మాట్లాడుతూ.. మన గ్రామంలో బెల్టు షాపుల్లో మద్యం అమ్మిన వారికి 25 వేలు, అలాగే మద్యం కొన్నవారికి రూ. 5000 రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు.