గుర్తు తెలియని మృతదేహం లభ్యం
VZM: కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఇవాళ తెలిపారు. మృతుడు సుమారు 5.5 పొడవు ఉన్నాడన్నారు. మృతదేహంపై లేత నీలం రంగు రౌండ్ నెక్ టీ షర్ట్, ముదురు నీలం రంగు ప్యాంటు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఎడమ చేతిపై 'కే.దేముడు' అని పచ్చబొట్టు ఉందని గుర్తించారు. వ్యక్తి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.