ట్రాక్టర్ బోల్తా.. చెల్లాచెదురైన ఆవుల దాణా
ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని శంకరాపురం హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆవుల దాణా లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి అదుపుతప్పు బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, ట్రాక్టర్లో ఉన్న దాణా రోడ్డుపై చెల్లాచెదురవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.