SRPT డిపో నుంచి లక్షకు పైగా కొనసాగిన ప్రయాణాలు

SRPT డిపో నుంచి లక్షకు పైగా కొనసాగిన ప్రయాణాలు

SRPT: SRPT డిపో అరుదైన రికార్డను నమోదు చేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఒక్క రోజే 1.25 లక్షల మంది ప్రయాణికులు డిపో పరిధిలో బస్సులను ఉపయోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. మహిళా ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో బస్టాండ్‌లు కిక్కిరిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 46 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపినట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు.