మంత్రి, ఎంపీ మధ్య మాటల యుద్ధం
NRPT: అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం రాజకీయ వేడిని పెంచింది. ఎంపీ డీకే అరుణ, మంత్రి వాకిటి శ్రీహరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మక్తల్ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని డీకే అరుణ సవాలు విసరగా.. మంత్రి వాకిటి శ్రీహరి దానికి స్పందిస్తూ తాను సిద్ధమన్నారు. ఎంపీ రౌడీజం గురించి ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు.