అన్నదాతలకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్

WGL: రైతు బీమా నమోదుకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు నేడే చివరి తేదీ అని మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. జులై ఐదు లోపు పాసుబుక్ వచ్చిన రైతులు స్థానిక ఏఈవో కార్యాలయంలో పట్టా బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, నామినీ ఆధార్ జిరాక్స్ సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.